వైసీపీ లో ఉన్న చాలామంది పవర్ ఫుల్ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్ గా ఇంట్లో కూర్చోవడం అనే కన్నా అజ్ఞాతంలో ఉంటున్నారు అనడం కరెక్ట్. కొడాలి నాని, పేర్ని నాని, బుగ్గన, రీసెంట్ గా వైసీపీ కి రాజీనామా చేసిన విజయ్ సాయి రెడ్డి ఇలా కొంతమంది మీడియా ముందు హడావిడి చెయ్యకుండా కామయ్యారు.
దానితో బ్లూ మీడియా వాళ్ళు వైసీపీ పై ప్రేమతో వాళ్ళెవరూ రాజీనామా చెయ్యడం లేదు, చేసినా ఇతర పార్టీల్లోకి వెళ్లడం లేదు. వైసీపీ మీద ప్రేమ చంపుకోలేక పార్టీలవైపు చూడడం లేదు. కాబట్టే కామ్ గా రాజకీయ సన్యాసం తీసుకున్నారు అంటూ కవర్ చేసుకుంటుంది. విజయ్ సాయి రెడ్డి అల్లుడు కోసం భయపడి వైసీపీ కి రాజీనామా చేసేసి ఇకపై నో పాలిటిక్స్ అన్నారు.
మరోపక్క ఆయన బిజెపిలోకి వెళతారని అంటున్నారు. ఇక కొడాలిని ఏ పార్టీ చేర్చుకోదు అందుకే కామయ్యాడు. వైసీపీ ని వదలకుండా సైలెంట్ గా ఇంట్లో కూర్చున్నాడు. ఇక పేర్ని నాని ఆయన భార్య పై వచ్చిన కేసులకు భయపడి సైలెంట్ అయ్యాడు. వైసీపీ ని మారుదామంటే ఆయన్ని ఎవరు చేర్చుకోరు. అంతలా ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లుగా మాట్లాడాడు.
ఇప్పుడు కామ్ గా లేకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఇకపై జైలుకు పోతారు. కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి జైలుకు పంపించడానికి రెడీ అవుతుంది. అందుకే ఈ సన్యాసం అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.