రెండేళ్ల గ్యాప్ తర్వాత పూజ హెగ్డే కి వచ్చిన దేవా ఛాన్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యిందో, ఆ సినిమా రిజల్ట్ ఆమెకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో అనేది పూజ అభిమానుల్లో చాలా క్యూరియాసిటీగా నడుస్తున్న ప్రశ్న. షాహిద్ కపూర్ హీరోగా రీసెంట్ గా విడుదలైన దేవ చిత్రానికి అనుకున్న రెస్పాన్స్ కనిపించడం లేదు.
గత మూడేళ్ళుగా పూజ హెగ్డే ని నిరాశపరిచిన సినిమాలు ఎలానో దేవ విషయంలోను జరిగినట్టే కనిపిస్తుంది. పుష్ప2 తర్వాత బాలీవుడ్ సినిమాలేవీ ఆడియన్స్ కి రీచ్ కాకపోవడం వలనే ఇలా జరుగుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. ఆ స్థాయి కంటెంట్ ను ప్రేక్షకులు ఆశిస్తున్నా హిందీ సినిమాలు ఆ విషయంలో వెనకబడిపోతున్నాయనే టాక్ నడుస్తుంది.
దేవ కి పర్వాలేదనిపించే కలెక్షన్స్ వస్తున్నాయి. దేవ ప్రమోషన్స్ లో పూజ హెగ్డే చాలా గ్లామర్ గా కనిపించింది. దేవ ను బాగానే ప్రమోట్ చేసింది. మరి పూజ హెగ్డే కి దేవా రిజల్ట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనే విషయంలో మాత్రం కాస్త వేచి చూడాల్సిందే.