డిసెంబర్ లో పెళ్లి అంటూ సింపుల్ గా శ్రీవారి దర్శనం చేసుకున్న సందర్భంలో అనౌన్స్ చేసేసిన కీర్తి సురేష్ ఎలాంటి హడావిడి లేకుండా కూల్ గా గోవాలో ఆంటోనితో మెడలో తాళి కట్టించుకుంది. అయితే తాను పెళ్ళికి ఎందుకు హడావిడి చెయ్యలేదు చేశాను అన్నట్టుగా ఈమధ్యన సంగీత్ ఫొటోస్, అలాగే మెహిందీ ఫొటోస్ షేర్ చేస్తూ తన పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది అని చెప్పకనే చెబుతుంది.
పెళ్ళికి ముందు ప్రమోషన్స్ లో హడావిడి చేసిన కీర్తి సురేష్ పెళ్లి అయిన వెంటనే ముంబై వచ్చేసింది. బేబీ జాన్ ప్రమోషన్స్ లో గ్లామర్ గా మెడలో తాళితో దర్శనమిచ్చింది. రీసెంట్ గా థాయిలాండ్ హనీమూన్ ట్రిప్ వేసిన కీర్తి సురేష్ మళ్లీ ముంబైలో కనిపించింది. నిన్న శుక్రవారం కీర్తి సురేష్ ముంబై ఎయిర్ పోర్ట్ లో దర్శనమిచ్చింది.
ఈమధ్యన బేబీ జాన్ రిజల్ట్ ఎలా ఉన్న కీర్తి సురేష్ గ్లామర్ పై బాలీవుడ్ దర్శకనిర్మాతలు కన్నేశారు. ఆమెకి ఆఫర్స్ వచ్చేస్తున్నాయనే టాక్ నడుసున్న సందర్భంలో కీర్తి సురేష్ మరోసారి ముంబై లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది. నెటిజెన్స్ మాత్రం ముంబైని వదలని కీర్తి సురేష్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.