సంక్రాంతికి వస్తున్నాం అంటూ సింపుల్ గా 300 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసారు వెంకిమామ దగ్గుబాటి వెంకటేష్. అనిల్ రావిపూడి జస్ట్ 75 రోజుల్లో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవడంతో బ్లాక్ బస్టర్ అయ్యింది. వెంకీ కెరీర్ లోనే సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సినిమా షూటింగ్ లో వెంకీ ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ.. ప్రమోషన్స్ లో మాత్రం యంగ్ హీరోల కన్నా మిన్నగా సినిమాని ప్రమోట్ చేసారు. ఆ కష్టానికి తగిన ఫలితాన్ని వెంకీ ప్రేక్షకులు మర్చిపోలేని హిట్ కట్టబెట్టి అందించారు. సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ తో రిలాక్స్ అయిన వెంకీ మామ నెక్స్ట్ ఏంటి.
రానా తో రానా నాయుడు 2 షూటింగ్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ ఏంటి, ఇదే దగ్గుబాటి అభిమానుల డౌట్. వెంకటేష్ నెక్స్ట్ ఏ జోనర్ లో సినిమా చేస్తారు, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు అనే విషయంలో చాలా ఆతృతగా ఉన్నారు. ప్రస్తుతం వెంకీతో సినిమాలు చేసేందుకు కుర్ర డైరెక్టర్స్ క్యూ కట్టేందుకు సిద్ధమవుతున్నారు.. మరి వెంకీ ప్లాన్స్ ఏమిటో చూడాలి.