బేబీ చిత్రం చూసాక వైష్ణవి చైతన్యను అంత త్వరగా మర్చిపోరు ప్రేక్షకులు. ఆ చిత్రంలో బేబీ గా వైష్ణవి చైతన్య నటనకు ఫిదా కావల్సిందే. ఆ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవడంతో అమ్మడు పేరు మోగిపోయింది. అయితే వైష్ణవి చైతన్య పదహారణాల తెలుగమ్మాయి ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంటుంది.
ఎంత మోడ్రెన్ వేసినా ఆమెలోని తెలుగుదనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈమధ్యన అమ్మడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ హడావిడి మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో రేర్ గా ఫొటోస్ వదిలే వైష్ణవి ఈమధ్యన తరచూ తన కొత్తందాలను షేర్ చేస్తూ యూత్ ని పడగొడుతుంది.
యూత్ కి ట్రీట్ ఇస్తుందో లేదంటే దర్శకనిర్మాతలకు వల వేస్తుందో తెలియదు కానీ తాజాగా వైష్ణవి చైతన్య చీరకట్టులో కనికట్టు చేసింది. బ్లూ సిల్క్ శారీలో చెవికి ముక్కుపుడక పెట్టుకుని కాస్త కొత్తగా కనిపించింది వైష్ణవి. ఇలా చూసాక ఈ పాప ని బిగ్ ప్రాజెక్ట్స్ కి ఏమైనా కన్సిడర్ చేస్తారేమో చూడాలి.