Advertisement
Google Ads BL

నేను కొడితే మామూలుగా ఉండదు.. కేసీఆర్!


బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. గులాబి బాస్ ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా..? ఫామ్ హౌస్ వాడికి ప్రజాక్షేత్రంలోకి ఎన్నడు వస్తారో అని ఎదురుచూసిన క్యాడర్, సొంత పార్టీ నేతలు.. ప్రత్యర్థుల కోరిక మేరకు రానే వచ్చారు. ఇదిగో వస్తూ వస్తూనే తన ఫైర్ మొత్తం బయట పెట్టారు. శుక్రవారం సిద్ధిపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో కేసీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమే అయ్యాయి. దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు తెగ సంబరపడి పోతున్నారు.

Advertisement
CJ Advs

నా సంగతి తెలియదు..! 

ఇన్ని రోజులుగా నేను మౌనంగా, గంభీరంగా చూస్తున్నాను. నేను కొడితే మాములుగా ఉండదు. తెలంగాణ శక్తి ఏదో కాంగ్రెస్ వాళ్ళకి చూపించి మెడలు వంచుతాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు. నిన్న కాంగ్రెస్ వాళ్లు పోల్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చింది. 70 శాతం బీఆర్ఎస్, 30 శాతం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. నేను ఎన్నికల ప్రచారంలో ఎన్ని సార్లు చెప్పినా రాష్ట్ర ప్రజలు వినలేదు. అత్యాశకు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. రైతు బంధుకి రాం రాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పాను. తులం బంగారానికి ఆశపడి హస్తం గుర్తుకు ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే అని గులాబీ దళపతి ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి బిడ్డ మనోడే..

మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడింది, సర్వనాశనం అయింది. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే. ప్రాణం పోయిన సరే తెగించి కొట్లాడేది మనమే, తెలంగాణకు రక్షణ మనమే. ఏడాది నుంచి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. త్వరలోనే భారీ సభ పెట్టుకుందాం. అన్ని మబ్బులు తొలిగిపోయి ఇప్పుడు నిజాలు బయటికి వస్తున్నాయి. మంచి ఏదో చెడు ఏదో ప్రజలకు తెలుస్తోంది. మాట్లాడితే ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ అని బద్నాం చేస్తున్నారు. ఫామ్ హౌస్ లోపల పంటలు తప్ప ఏముంటాయి..? అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు కేసీఆర్ బయటికి రాలేదని, ఎప్పుడు వస్తున్నారని మాట్లాడిన, మరీ ముఖ్యంగా ఫామ్ హౌస్ అని మాట్లాడిన వాళ్లకు కూడా ఒకే ఒక్క కార్యక్రమంతో అందరి నోళ్ళు మూపించేసారని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. పనిలో పనిగా భవిష్యత్ కార్యాచరణ కూడా చెప్పడంతో పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

KCR become active again:

KCR who came out after a few months
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs