Advertisement
Google Ads BL

వైఎస్ జగన్‌కు బీజేపీ ఊహించని ఝలక్!


జగన్‌కు ఝలక్.. కమల రథసారధిగా సింగారెడ్డి!

Advertisement
CJ Advs

టార్గెట్ వైసీపీ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టాలని ఇటు రాష్ట్రంలోని టీడీపీ కూటమి.. అటు కేంద్రంలోని మోదీ సర్కార్ ప్లాన్ల మీద మాస్టర్ ప్లాన్స్ వేస్తోంది. ఐతే ఇప్పటికే వైసీపీకి జరగాల్సిన నష్టం ఓ వైపు జరిగిపోతోంది. ఐతే పార్టీ నేతలు, క్యాడర్ సైలెంట్‌గా ఉండటం.. మరోవైపు ఉన్న కొద్దిమంది కీలక నేతలు పార్టీని వీడటం.. ఇంకోవైపు ఎప్పుడేం జరుగుతుందో తెలియక క్యాడర్, అధిష్టానంలో ఆందోళన నెలకొంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంచు మించు మళ్ళీ పార్టీ ఆవిర్భావంలో మాదిరిగా జీరో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇదే క్రమంలో జగన్ రెడ్డి ఊహించని రీతిలో ఝలక్ ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పులివెందుల నియోజకవర్గానికి చెందిన నేత సింగారెడ్డి రామచంద్రారెడ్డిని ఫిక్స్ చేసింది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఎవరీ సింగిరెడ్డి..?

నిన్న మొన్నటి వరకూ దగ్గుబాటి పురంధేశ్వరిని కంటిన్యూ చేస్తారని పెద్ద ఎత్తునే చర్చ జరిగింది. ఐతే ఢిల్లీలోని అగ్రనేతలు ఇంతలోనే ఎందుకో మనసు మార్చుకున్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా.. రెడ్డిని రెడ్డితోనే కొట్టాలని ఫిక్స్ అయ్యారు. అందులోనూ పులివెందులకు సంబంధించిన నేతతోనే కావడం ఒక్క చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది. మొదటి నుంచి బీజేపీ కోసం పనిచేస్తూ సాధారణ కార్యకర్త నుంచి ఎదిగిన వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే కమనాథులు ఉన్నారు. ఈ క్రమంలోనే సింగారెడ్డి పేరును ఫైనల్ చేసిందని బీజేపీ వర్గాల సమాచారం. సింగారెడ్డిది పులివెందుల నియోజకర్గంలోని వేంపల్లె. 1978 నుంచి ఆర్ఎస్ఎస్‌లో పని చేస్తూ వస్తున్నారు. 2017లో ఏపీ బీజేపీ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి పోటీ చేశారు కానీ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఐనా సరే ఎలాంటి అసంతృప్తి గురికాకుండా కిసాన్ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన-ప్రచార కమిటీకి ఏపీ కన్వీనర్‌గానూ రామచంద్రారెడ్డి పనిచేశారు. దీంతో పార్టీకి.. కేంద్రంలోని పెద్దలకు వీర విధేయుడు అయ్యారు సింగిరెడ్డి. మరీ ముఖ్యంగా దూకుడు స్వభావం ఉండే యంగ్ లీడర్.

శత్రువులు అంతా సీమ బిడ్డలే!

ఒకవేళ సింగిరెడ్డి ఫిక్స్ ఐతే జగన్ రెడ్డికి బ్యాడ్ టైం మొదలైనట్టే అని రాష్ట్ర రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇప్పుడున్న ప్రాంతీయ, జాతీయ పార్టీల్లో ఒక్క జనసేన తప్పితే మిగిలిన అన్ని పార్టీల అధిపతులు అంతా రాయలసీమ వారే కావడం గమనార్హం. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెడ్డి కూడా సీమ బిడ్డే. ఇక కొన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలకు సీమ నేతలే కొనసాగుతున్నారు. ఐతే ఇప్పడు అందరి టార్గెట్ వైఎస్ జగన్, వైసీపీ స్థానం (40 శాతం ఓటు బ్యాంకు). దీంతో టీడీపీ, జనసేన, ఇప్పుడు బీజేపీ తహతహలాడుతోంది. సీమలోని శత్రువులను, సొంత జిల్లా నుంచి జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే వైఎస్ షర్మిల, సింగిరెడ్డిని వైఎస్ జగన్ ఎలా ఎదుర్కొంటారు? అన్నది చూడాలి మరి.

YS Jagan Unexpected BJP Jhalak!:

Singareddy as the new chief of BJP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs