నందమూరి నటసింహా బాలకృష్ణ-దర్శకుడి బాబీ కాంబోలో తెరకెక్కిన డాకు మహారాజ్ జనవరి 12 న సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి రిలీజ్ అయిన రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. తర్వాత మాస్ ఆడియన్స్ కు డాకు మహారాజ్ కనెక్ట్ అవడంతో ప్రతి ఏరియాలో డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ అయ్యింది, దానితో నిర్మాత నాగవంశీ సేఫ్ అయ్యాడు.
రీసెంట్ గానే అనంతపురంలో డాకు సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసారు. ఇక జనవరి 12 న థియేటర్స్ లో విడుదలైన డాకు మహారాజ్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా మాస్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. డాకు మహారాజ్ ఓటీటీ పార్ట్నర్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఉంది.
నెట్ ఫ్లిక్స్ సంస్థ డాకు ను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకోగా.. ఇప్పుడు డాకు మహారాజ్ విడుదలైన నాలుగు వారాల్లోపే అంటే ఫిబ్రవరి 9 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఇక ఓటీటీ ఆడియన్స్ కు పండగే కదా!