బుట్టబొమ్మ పూజ హెగ్డే మళ్లీ బిజీ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఒకప్పుడు నాలుగు షిఫ్ట్ ల్లో పని చేసిన పూజ హెగ్డే గత రెండేళ్లుగా ఖాళీగా కూర్చుంది. వరస వైఫల్యాలు అమ్మడిని ఒక్కసారిగా నిరాశపరచడంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి. తర్వాత సోషల్ మీడియాలో పూజ హెగ్డే అరుదుగా కనిపించింది.
ఈమధ్యన కోలీవుడ్ లో పూజ హెగ్డే స్టార్ హీరోలతో లైన్ గా అవకాశాలు అందుకుంటుంది. తమిళనాట సూర్య తో అటు విజయ్ తో రొమాన్స్ చేస్తున్న పూజ ఇప్పుడు రాఘవ లారెన్స్ కాంచన సీరీస్ లో హీరోయిన్ గా ఎంపికైనట్లుగా తెలుస్తోంది. ఒకేసారి సూర్య, విజయ్, రాఘవ లారెన్స్ అవకాశాలతో పూజ హెగ్డే మరోసారి క్రేజీగా మారింది.
అంతేకాదు ఆమె నటించిన దేవా హిందీ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. మరోపక్క సోషల్ మీడియాలోనూ అమ్మడు జోరు పెంచేసింది. గ్లామర్ ఫొటోస్ తో పూజ హెగ్డే మతిపోగొట్టేస్తుంది. తాజాగా వదిలిన పూజ హెగ్డే పిక్ మాత్రం నెట్టింట సంచలనంగా మారింది.