Advertisement
Google Ads BL

రశ్మిక ఇష్టపడే సీరీస్ ఏమిటంటే..


స్టార్ హీరోల హిట్ చిత్రాలు అభిమానులు ఎన్నిసార్లు అయినా చూసేందుకు సిద్ధంగా ఉంటారు. అదే విధంగా ఇతర హీరోల సినిమాలపైనా అదే స్థాయిలో ఆసక్తి చూపిస్తారు. అలాంటి ఆసక్తి నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకూ ఉందా అంటే అవునని ఆమె చెబుతోంది. నటీనటుల విషయాలను పక్కన పెడితే రష్మిక 12వ ఏట నరుతో ఊజుమాకీ అనే కామిక్ సిరీస్‌పై ఎంతో మక్కువ చూపిందట.

Advertisement
CJ Advs

ఈ సిరీస్‌లోని నరుతో పాత్ర ఆమె మొదటి క్రష్‌గా చెప్పుకుంటుంది. సుమారు ఆరువందల ఎపిసోడ్లను ఆమె ఒక్కటీ మిస్ కాకుండా చూసిందట. ఒక్కోసారి 30-40 ఎపిసోడ్లను ఒకేసారి చూస్తూ ఆస్వాదించేదట. ఇప్పటికీ ఆమెకు ఈ సిరీస్‌ అంటే విపరీతమైన మక్కువ. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. అప్పుడప్పుడు ఈ కామిక్ సిరీస్‌ను చూసి ఆనందిస్తుందట. నరుతో ఊజుమాకీ సిరీస్‌ ఆమెకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించిందని రష్మిక చెప్పింది.

ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో బిజీగా ఉంది. పుష్ప-2 విజయంతో ఆమె పాన్-ఇండియా క్రేజ్‌ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సికిందర్, తమ్మా, ది గర్ల్‌ఫ్రెండ్, కుబేర వంటి చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటుంది. టాలీవుడ్‌లో ఒక పెద్ద నిర్మాత ఆమెతో లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. రష్మిక పాన్-ఇండియా ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథను లాక్ చేసినట్లు తెలుస్తోంది.

Rashmika favorite series is..:

Rashmika Mandanna Reveals About Her Favorite Anime
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs