షాకింగ్ లుక్ లో కల్కి 2898 AD హీరోయిన్ బాలీవుడ్ భామ దీపికా పదుకొనే. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడుతున్న వార్త. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జోడిగా దీపికా నటించిన ఫస్ట్ సౌత్ మూవీ కల్కి 2898 AD. అయితే ఈచిత్రం షూటింగ్ ఫినిష్ అవ్వకముందే దీపికా పదుకొనె ప్రెగ్నెంట్. గత ఏడాది పాపకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే డెలివరీ ముందు వరకు చాలా యాక్టీవ్ గా కనిపించింది.
అయితే డెలివరీ విషయంలో కాంప్లికేషన్ రావడంతో ఆమె పాపతో పాటుగా ఓ వారం ఆసుపత్రిలోనే ఉంది. తర్వాత డిస్ఛార్జ్ అయ్యి వెళ్లిన దీపికా పదుకునే గత రాత్రి మొదటి పబ్లిక్ ఈవెంట్ లో కనిపించి నిజంగా షాకిచ్చింది. బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ సంస్థ సబ్యసాచి 25 వ ఫ్యాషన్ షో లో దీపికా పదుకొనె ర్యాంప్ వాక్ చేసింది.
ఈ షోలో దీపికా వైట్ డ్రెస్ లో కళ్ళ జోడు పెట్టుకుని కనిపించడమే కాదు, బొద్దుగా మారిపోయి అసలు గుర్తు పట్టలేని లుక్ లో షాకిచ్చింది. దీపికా ను అలా చూసి ఆమె ఫ్యాన్స్ షాకయ్యారు. అంతేకాదు ఆమెను సీనియర్ నటి రేఖతో పోలుస్తున్నారు. రేఖ కూడా గతంలో అలాంటి వైట్ డ్రెస్ లో అచ్చం దీపికా పదుకొనె లా కనిపించింది. దానితో అందరూ దీపికా రేఖ లుక్ లో అంటూ కామెంట్ చేస్తున్నారు.