Advertisement
Google Ads BL

షాకిస్తున్న ధనుష్ పారితోషికం


తమిళ నటుడు ధనుష్ ప్రస్తుతం తెలుగు, హిందీ పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పెంచుకుంటున్నాడు. ఇటీవల వేంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ చిత్రం ధనుష్‌కు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ విజయం తర్వాత తెలుగులో మరో హిట్ కొట్టాలని ధనుష్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేర చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఈ సినిమా కోసం ధనుష్ తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. తమిళంలో కంటే తెలుగులో సినిమాలు పెట్టుబడులకు మంచి లాభాలను అందిస్తున్న నేపథ్యంలో ఆయన పారితోషికం గణనీయంగా పెరిగింది. అయితే తమిళ నిర్మాతలు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడంలో సంకోచం చూపుతుండగా టాలీవుడ్ నిర్మాతలు ధనుష్‌తో సినిమాలు చేయడంలో ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇక తాజాగా ఓ యువ నిర్మాతతో ధనుష్ తన తదుపరి తెలుగు చిత్రంపై చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు కూడా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా కోసం ధనుష్ ఒకేసారి రూ.60 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంత భారీ పారితోషికాన్ని ఇవ్వడం గురించి నిర్మాతలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ధనుష్ డిమాండ్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై అనేక చర్చలు జరుగుతున్నాయి. అయితే తెలుగులో మంచి మార్కెట్ ఉండటంతో తమిళ నటులు, ముఖ్యంగా ధనుష్, దుల్కర్ సల్మాన్ వంటి వారు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు.

తెలుగు పరిశ్రమలో ధనుష్‌కు వస్తున్న ఆదరణ చూస్తే ఆయనకు టాలీవుడ్‌లో మరింత అవకాశాలు దక్కుతాయని చెప్పవచ్చు. కానీ నిర్మాతలు ధనుష్ పారితోషికంపై నిర్ణయం తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏ సినిమా అయినా మంచి కంటెంట్ ఉంటేనే విజయం సాధిస్తుంది. లేకపోతే భారీ రెమ్యునరేషన్ పెట్టిన సినిమాలు నెగిటివ్ టాక్ వస్తే నిర్మాతలకు నష్టాలే మిగుల్తాయి.

Dhanush big demand shocks Tollywood:

Dhanush Shocking Remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs