సమంత: పెళ్లయ్యింది, తర్వాత విడాకులు అయ్యాయి. అయినప్పటికీ కెరీర్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న సమంత ఈమధ్యన సినిమాలకు బ్రేకిచ్చి కేవలం వెబ్ సీరీస్ లపైనే ఫోకస్ పెట్టింది. రాజ్ అండ్ డీకే ద్వయంతో వర్క్ చేస్తున్న సమంత రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ ఫినిష్ చేసింది. మరో వెబ్ సీరీస్ కి వర్క్ చేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వైఉంటుంది. ఈ మధ్యనే లైఫ్ కి గేమ్ చేంజర్ అంటూ తనలోని మూడు లక్షణాలు బుక్ లో రాసుకోమన్న సమంత తాజాగా షేర్ చేసిన పిక్స్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అనాల్సిందే. శారీ లో సింపుల్ గానే కనబడుతున్నా మల్టీకలర్ చీరలో సమంత బ్యూటిఫుల్ గా కనిపించింది.
అలియా భట్: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సెలెక్టెడ్ మూవీస్ తో క్రేజి హీరోయిన్ గా మారిన అలియా భట్ కి రణబీర్ కపూర్ తో పెళ్లయ్యింది. రాహ కు తల్లయ్యింది. అయినప్పటికి ఆమె క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు, మరికాస్త పెరిగింది అనే చెప్పాలి. పాప పుట్టాక కూడా అలియా లోని అందం, ఆకర్షణ తగ్గలేదు.
బరువు పెరగలేదు. చక్కటి ఫిట్ నెస్ ని మైంటైన్ చేస్తున్న అలియా భట్ తాజాగా చీర కట్టులో మెస్మరైజ్ చేసింది. డిజైనర్ బ్లౌజ్ లో బ్లాక్ శారీ లో అలియా అందాలు వర్ణనాతీతం అన్నట్టుగా ఉన్నాయి.