నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తనయుడిగా అడుగుపెట్టిన బాలకృష్ణ.. తండ్రి అడుగుజాడల్లో ప్రయాణించి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు.14 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య పౌరాణికం, జానపదం, సాంఘీకం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఇక అటు ఎమ్మెల్యేగా ప్రజాసేవ, ఇటు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి ఆపన్న హస్తం అందించారు. కళల రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. ఆయనకు వచ్చిన ఈ అవార్డు దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ కావడం విశేషం అని చెప్పుకోవచ్చు. దీంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు, అనుచరులు ఎంతో సంతోషంగా ఉంటే వైసీపీకి చెందిన కొందరు కార్యకర్తలు విషం కక్కుతున్న పరిస్థితి. ఇంకొందరి ఏడుపు గురుంచి ఐతే అబ్బో మాటల్లో చెప్పలేం.
అవసరమా..?
అసలే వైసీపీ పరిస్థితి బాగోలేనప్పుడు కాస్త ప్రశాంతంగా నేతలు, అధిష్ఠానంను ఉండనివ్వకుండా లేని, పోనీ విజయాలు తెరపైకి తేవడం, అనవసరపు విజయాల్లో కలుగజేసుకొని పార్టీకి చెడ్డ పేరు తీస్తున్న పనులు చేస్తున్నారు కొందరు. ఇదిగో వైసీపీకి చెందిన ఓ కరుడు గట్టి నకార్యకర్త, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరాభిమాని ఎంతలా విమర్శలు చేస్తున్నారంటే విమర్శకు కూడా హద్దు ఉంటుంది. కానీ ఆ గీత దాటి మరీ ప్రవర్తించి రెచ్చగొడుతూ లేనిపోని రచ్చ పెడుతున్నారు. అందుకు ఈ ట్విట్టర్ పోస్టు అక్షరాలా సాక్ష్యం. దీంతో మిగిలిన కార్యకర్తలు ఆయన్ను తిట్టిపోస్తున్నారు.
మీకు ఇది తగునా..?
అవార్డులల్లో ఎవరి ప్రియారిటీ వాళ్ళది. నవరత్నాలు- సూపర్ సిక్స్ అంటూ కార్యకర్తలు పోలుస్తూ హడావుడి చేశారు. వైఎస్ జగన్ తన హయాంలో నవరత్నాలు హామీలు ఇచ్చి అమలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఇక కూటమి అధికారంలోకి రాక ముందు ఏం చెప్పింది? వచ్చాక ఏం చేసింది..? అని పోల్చుతూ ట్వీట్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు తల్లికి వందనం - 15 వేలు, ఆడబిడ్డకు - 15 వందలు, రైతులకు - 20 వేలు, నిరుద్యోగులకు - 3 వేలు, మహిళలకు - ఉచిత బస్సు, బీసీలకు- 50 ఏళ్లకు పెన్షన్లు అని చెప్పిన హామీలు గుర్తు చేశారు. ఐతే ఎన్నికల్లో గెలిచాక తమకు నెరవేర్చుకుంటున్న సూపర్ సిక్స్ హామీలు బాలకృష్ణకు - పద్మభూషణ్, నారా లోకేశ్‌కు - డిప్యూటీ సీఎం, చిరంజీవికి - రాజ్యసభ, నాగబాబుకు - మంత్రి, పురంధేశ్వరికి- కేంద్రమంత్రి, ఏబీ వెంకటేశ్వర రావుకు - కేసుల మాఫీ ఇవే సూపర్ సిక్స్ అమలు అంటే. ఇప్పటికైనా అర్ధమవ్వాలి ప్రజలకు స్వార్థపరుల ప్రియార్టీలు ఏంటో! అని కొందరు వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేస్తున్న పరిస్థితి.
జగన్ మాత్రం ఇలా..!
ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, భారతదేశ అత్యున్నత పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (వైద్యం), నందమూరి బాలకృష్ణ (కళలు), మంద కృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మాడుగుల నాగఫణి శర్మ (కళలు), కేఎల్ కృష్ణ (విద్య, సాహిత్యం), మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు), వాదిరాజు రాఘవేంద్రాచారి పంచముఖి (విద్య, సాహిత్యం) లకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పగా.. ఆ పార్టీ క్యాడర్ మాత్రం ఇలా చేయడం ఎంత వరకు సబబు..!