వైసీపీ లో ఏం జరుగుతుంది.. వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతుందా, ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న నేతలంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా, లేదు పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారా, విజయసాయి రెడ్డి రాజీనామా ఎఫెక్ట్ వైసీపీ పై ఎంతుంటుంది, ఆయనతో పాటుగా ఎంతమంది వైసీపీ ని వదిలేస్తారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో కనబడుతున్న వార్తలు.
విజయ్ సాయి రెడ్డి రాజీనామా తర్వాత కొడాలి నాని, ఇంకా వంశి వల్లభనేని కూడా రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకోబోతున్నారు, ఇకపై వైసీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుంది, అటు జగన్ కూడా జైలుకెళ్ళే సమయం ఆసన్నమైంది, దీనితో వైసీపీ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోతోంది అంటూ కనిపిస్తున్న వార్తలతో కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది.
సాయి రెడ్డి సడన్ గా పాలిటిక్స్ నుంచి తప్పుకోవడం మాత్రం వైసీపీ కి బిగ్ షాక్. కానీ సోషల్ మీడియాలో కనిపించే వార్తలతో మరింతగా షాకవుతూ టెన్షన్ లోకి వెళుతున్నారు నేతలు, అభిమానులు. ఇలాంటి సమయంలో జగన్ ఈ రాజీనామాల వార్తలను ఖండిస్తే బావుంటుంది. లేదంటే పార్టీకి ఈ వార్తలు మరింత చేటు చేసే ప్రమాదం లేకపోలేదు.