శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ లైన్ లోకి వచ్చేసింది. కొన్నాళ్లుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకతను చూపుతుంటే ఇప్పుడు చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా తెరంగేట్రం చెయ్యడానికి సిద్దమైపోయి.. వరసగా గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ అద్దరగొడుతుంది.
కొద్దిరోజులుగా అక్క జాన్వీ కపూర్ కి చెల్లి ఖుషి కపూర్ పోటీ కి వస్తుందా అనేలాంటి ఫోటో షూట్స్ తో ఖుషి కపూర్ అందాల ఆరబోత కనిపిస్తుంది. తాజాగా ఖుషి కపూర్ చేయించుకున్న ఫోటో షూట్ చూస్తే ఈ చిన్నదాని ఎంట్రీ ఎప్పుడో అనకుండా ఉండలేరు.
క్రీం కలర్ చుడిదార్ లో ఈ చిన్నది అందాలను చూపించి చూపించనట్టుగా చూపించి యూత్ ని అలవోకగా ఆకర్షించేసింది. ప్రస్తుతం ఖుషి కపూర్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.