రష్మిక మందన్న వరుసగా ఫోటోషూట్లతో తన ప్రత్యేకతను చూపిస్తూనే ఉంది. తాజాగా ఫెమినా ఇండియా కవర్ ఫోటోషూట్‌లో రష్మిక తన చార్మ్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఈ ప్రత్యేక ఫోటోషూట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది. ఫెమినా ఈ సందర్భంగా రష్మికను నేటితరంలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ గా ప్రశంసించింది.
ఫెమినా పేర్కొంటూ ఈ సంవత్సరానికి రష్మిక మందన్నతో ఆరంభం చేయడం ఎంతో ప్రత్యేకం. నేటి ప్రపంచంలో సూపర్ స్టార్ అంటే ఏమిటో ఆమె తన ప్రతిభతో నిర్వచిస్తున్నారు, అంటూ ప్రశంసలు అందించింది. ప్రత్యేకంగా పుష్ప 2 సినిమాతో వచ్చిన ఘన విజయంతో రష్మిక, నేటి అత్యంత అభిమానించబడే కథానాయికల్లో ఒకరిగా నిలిచింది.
రష్మిక తన అసమాన ప్రతిభ, ఆకర్షణీయమైన ఉనికి, ప్రేక్షకులతో సరిహద్దులని దాటే కనెక్షన్ ద్వారా లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఫెమినా ఈ విషయంపై ప్రత్యేక కథనాన్ని షేర్ చేస్తూ, రష్మిక ప్రపంచాన్ని ఆకర్షించే సామర్థ్యం కలిగిన స్టార్ అని పేర్కొంది.
ఈ ఫోటోషూట్‌తో రష్మిక తన అందం, ప్రతిభ, ఆత్మవిశ్వాసాన్ని మరోసారి ప్రదర్శించింది. రష్మిక మందన్నకు ఉన్న ఆదరణ, ఇమేజ్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.