Advertisement
Google Ads BL

జగన్ కు దెబ్బ మీద దెబ్బ


Big shock to Jagan2024 ఎన్నికల్లో ఓటమితో అతి పెద్ద లాస్ అయిన వైసీపీ కి ఇప్పుడు వరసగా తగులుతున్న ఎదురు దెబ్బలు మరింతగా కుంగదీస్తున్నాయి. 2024 ఎలక్షన్స్ లో ఓడిపోయిన జగన్ నుంచి చాలామంది నేతలు దూరంగా ఉండడమే కాదు, టీడీపీ, జనసేన పార్టీల్లో కి దూరిపోయిన వారూ ఉన్నారు. మరికొంతమంది కూటమి ప్రభుత్వ కేసులకు భయపడి కామ్ గా ఇంట్లోనే ఉంటున్నారు. 

Advertisement
CJ Advs

వల్లభనేని వంశి, కొడాలి నాని ఇలా చాలామంది వైసీపీ నేతలు కామ్ గా అంటే.. మరొపక్క రాజ్యసభలో తమకు బలం ఉంది, బీజేపీ కి మేము కావాలని విర్రవీగిన జగన్ కు రాజ్యసభ ఎంపీలు వరసగా షాకులిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు వైసీపీ ఎంపీలు రాజ్యసభకు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. 

కృష్ణయ్య, మోపిదేవి, బీదా మస్తాన్ రావు లు ఇప్పటికే వైసీపీకి రాజ్యసభ  చేస్తే ఇప్పుడు వైసీపీ లో నెంబర్ 2 అయిన విజయ్ సాయి రెడ్డి జగన్ కు షాకిస్తూ రాజ్యసభకు, వైసీపీకి మాత్రమే కాదు అసలు రాజకీయాలకే రాజీనామా చెయ్యడంతో జగన్ కి పెద్దషాక్ తగిలింది అని చెప్పాలి. విజయ్ సాయి రెడ్డి రాజీనామా ప్రకటన అనంతరం వైసీపీ లో గుబులు మొదలయ్యింది. 

విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేసిన పది నిమిషాల్లోనే వైసీపీ కి చెందిన మరో రాజ్యసభ ఎంపీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. అయోధ్య రామిరెడ్డి కూడా వైసీపీ ని వీడుతున్నాడనే వార్త వైరల్ అయ్యింది. వైసీపీలో నెంబర్ 3 అయిన అయోధ్య రామిరెడ్డి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జగన్ కు ఎదురు దెబ్బె అని చెప్పాలి అంటున్నారు రాజకీయ నిపుణులు. 

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అయోధ్య రామిరెడ్డి, వచ్చేవారం రాజ్యసభ సభ్యత్వానికి అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

Big shock to YS Jagan:

Big shock to Jagan Mohan Reddy and YCP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs