Advertisement
Google Ads BL

జగన్ నుంచి సైడ్ అయిపోయిన సాయి రెడ్డి


వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. అసలే ఘోర పరాజయం, పార్టీ పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ఈ స్థితిలో ఇన్నాళ్లు నంబర్‌గా ఓ వెలుగు వెలిగిన, ఢిల్లీ వేదికగా చక్రం తిప్పిన ఎంపీ, విజయసాయిరెడ్డి హ్యాండిచ్చేశారు. జగన్‌కు టాటా చెప్పేయడం, పార్టీకి 25న రాజీనామా చేస్తానని ప్రకటించడం పెను సంచలనమే అయ్యింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ ప్రకటనే చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీలోనూ చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.

Advertisement
CJ Advs

మంచి జరగాలి!

రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించాను.

ఈ ట్విస్ట్ ఏంటో?

చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని అని సాయిరెడ్డి ప్రకటించారు. పార్టీకి గుడ్ బై వరకూ ఓకే, రాజీనామా కూడా ఓకే.. చివరికి ఇలా చంద్రబాబు కుటుంబంతో, పవన్‌తో వ్యక్తిగత బేధాలు అని ప్రకటించడం గమనార్హం. దీంతో మళ్లీ లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి.

Vijaya Sai Reddy Announces Retirement :

YCP MP Vijaya Sai Reddy Announces Retirement from Politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs