రాజమౌళి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే SSMB 29 చిత్రం జనవరి 2 న పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా మొదలైనప్పటికి.. అది అధికారికంగా బయటపెట్టలేదు. అంతేకాదు హీరోయిన్ గా బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది.. అనే వార్తల నేపథ్యంలో ప్రియాంక చోప్రా గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లో కనిపిస్తుంది.
ప్రియాంక చోప్రా రాజమౌళి-మహేష్ బాబు SSMB 29 చిత్రం కోసమే హైదరాబాద్ వచ్చింది. అందుకే ఆమె ఇక్కడే స్టే చేసింది అంటున్నారు. రాజమౌళి మహేష్ SSMB 29 రెగ్యులర్ షూటింగ్ కోసమే ఆమెను హైదరాబాద్ రప్పించారని, ఆమెకు లుక్ టెస్ట్ చేసి ఆమె లుక్ ఫైనల్ చేసారని అంటున్నారు.
మరోపక్క మహేష్ ఈరోజు జనవరి 24 నుంచి రాజమౌళి తో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కూడా SSMB 29 మొదటి షెడ్యూల్ కోసమే హైదరాబాద్ ఉంది, ఇప్పటికే చిలుకూరు వెళ్లి బాలాజీ టెంపుల్ లో కొత్త ప్రయాణం మొదలు అంటూ SSMB 29 పై ఆమె హింట్ ఇచ్చింది అంటున్నారు. మరి రాజమౌళి ఈప్రాజెక్టు ని ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో చూడాలి.