సీనియర్ హీరోలైన బాలయ్య, వెంకటేష్, చిరంజీవి లు సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. వెంకీ, బాలయ్య ఫుల్ స్వింగ్ లో 100 కోట్ల కలెక్షన్స్ తో సంక్రాంతికి దుమ్మురేపారు. త్వరలోనే చిరంజీవి విశ్వంభరతో రాబోతున్నారు. కానీ మరో సీనియర్ హీరో నాగార్జున మాత్రం గమ్మున సైలెంట్ గా ఉన్నారు.
గత ఏడాది నా సామిరంగా చిత్రం తర్వాత నాగార్జున సోలోగా మరో సినిమా అనౌన్స్ చెయ్యలేదు. కానీ ధనుష్ కుబేరాలో, సూపర్ స్టార్ కూలి చిత్రాల్లో నాగార్జున కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతేతప్ప ఆయన సోలోగా సినిమా మాత్రం పట్టాలెక్కించలేదు. చిరు, వెంకీ, బాలయ్యలు 100 కోట్ల హీరోలయ్యారు, నాగ్ ఎప్పుడు 100 కోట్ల సినిమా చేస్తారని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు
నాగార్జున మాత్రం అటు మల్టీస్టారర్స్ చేసుకుంటూ.. మరోపక్క తన పెద్ద కొడుకు చైతు పెళ్లి చేసారు. అలాగే చిన్న కొడుకు అఖిల్ పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున కొత్త ప్రాజెక్ట్ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చెయ్యాలో.. చూద్దాం.