పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏదైనా సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు అదే మంచు విష్ణు కన్నప్పలో క్యామియో చేస్తున్నారు అనగానే కన్నప్పపై అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే ప్రభాస్ మాత్రమే కాదు.. ఈ చిత్రంలో ప్రతి భాష నుంచి టాప్ స్టార్స్ భాగమయ్యారు.
బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతిగా, మోహన్ లాల్ ఇలా చాలామంది క్రేజీ స్టార్స్ భాగమైన కన్నప్ప లో ప్రభాస్ పాత్ర నిడివి ఎంతుంటుంది, క్షణాల్లో మాయమయ్యే పాత్ర కాదు కదా, కాస్త నిడివి ఉన్న పాత్ర అయితే సినిమాకి హెల్ప్ అవుతాది అనేది ప్రభాస్ ఫ్యాన్స్ డౌట్. మరి విష్ణు ప్రభాస్ ని ఎలా ఒప్పించారో కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆయన పాత్రపై మాత్రం అనుమానం కలుగుతుంది.
కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ కూడా రిలీజ్ అయితే సినిమాపై క్రేజ్ పెరుగుతుంది, కానీ ప్రభాస్ పాత్ర పై క్లారిటీ రాదు, ఇలాంటి సమయంలో కన్నప్ప పై ఎలాంటి హోప్స్ పెట్టుకోవాలో ఫ్యాన్స్ కు అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతున్నారు.