Advertisement
Google Ads BL

అదే నా లైఫ్ లో గేమ్ చేంజర్ -సమంత


సమంత కెరీర్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లోను ఏం జరిగినా అది సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేస్తుంది. కొద్దిరోజులుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి కేవలం వెబ్ సీరీస్ లను ఎంచుకుంటున్న సమంత రీసెంట్ గా ప్రొడ్యూసర్ గాను మారింది. సమంత తాజాగా తన లైఫ్ కి గేమ్ చేంజర్ ఏమిటో తన ఇన్స్టా పోస్ట్ లో రాసుకొచ్చింది. 

Advertisement
CJ Advs

నా లైఫ్ లో కొన్ని కఠినమైన క్షణాలు నన్ను ఇలా మార్చేశాయి. నాకున్న ఈ అలవాటు చాలా సులభమైంది. కానీ చాలా పవర్‌ఫుల్. ప్రస్తుతం నా లైఫ్ ఎక్కడుంది, అసలు నేను ఎక్కడున్నాను. నా ఫ్యూచర్ ఏమిటి అనే విషయాలు తెలుసుకొనేందుకు చేసిన ప్రయత్నాన్ని నాకు నేను అప్రిషియేట్ చేసుకొంటున్నాను. వినడానికి కొంత వింతగా ఉంటుంది, కానీ అదే నిజం. 

నీ లైఫ్ లో నువ్వు సాధించిన వాటిని మూడు మాటల్లో రాసుకొని చూడండి. నిజంగా మీకు రాయడం వస్తే.. అలాంటి అలవాటు ఉంటే.. ఆ మూడు రాసుకుని చూడండి. మీ లైఫ్ కి దోహదపడిన పెద్ద విషయాలు కాకపోవచ్చు. కానీ అవి నిజాయితీగా ఉండాలి. అలా రాయడం మీకు కష్టం లేదా ఒత్తిడిగా ఉంటే ఫర్వాలేదు. మీరు బలంగా నమ్మే వ్యక్తికి షేర్ చేయమని మీ మనసుకు చెప్పడానికి ప్రయత్నించండి.. 

ప్రశాంతంగా కూర్చుని మీ మనసులో కనీసం థాంక్స్ చెప్పుకున్నా సరిపోతుంది. అది మీ జీవితానికి గేమ్ ఛేంజర్ అవుతుంది అంటూ సమంత తన పోస్ట్ లో రాసుకొచ్చింది. 

That is the game changer in my life - Samantha:

Samantha reveals her mantra to get through tough moments
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs