ఈ సంక్రాంతి పండగకి సంక్రాంతికి వస్తున్నాం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకటేష్ ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలకు ముందు నుంచే వెంకటేష్ ఆ సినిమా ప్రమోషన్స్ లో క్రేజీగా పాల్గొన్నారు. సినిమా విడుదలై 200 కోట్లు కొల్లగొట్టాక కూడా సినిమాని ఇంకా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం మీడియా మీట్ లో వెంకటేష్ తన పారితోషికం పై హాట్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. ఆ సందర్భంలో మీడియా వాళ్ళ ప్రశ్నలకు అనిల్ రావిపూడి తాను సుకుమార్ ఇంటి పక్కకు షిఫ్ట్ అవ్వలేదు, కాబట్టే ఐటి రైడ్స్ తనపై జరగలేదు అన్నాడు.
హీరోలు కూడా పారితోషికాన్ని బ్లాక్ లో కాకుండా వైట్ లో తీసుకుంటే సమస్యలు ఉండవు కదా అని రిపోర్టర్ వేసిన ప్రశ్నకు వెంకటేష్ మాత్రం తనకు అందరి హీరోల్లా ఆశ లేదు, తాను కొంచెమే పారితోషికం తీసుకుంటాను, అది కూడా వైట్ లో తీసుకుంటాను అంటూ తన పారితోషికంపై వెంకీ సరదాగా కామెంట్స్ చేసారు.