బోయపాటి శ్రీను తో బాలయ్య సినిమా అంటే బాక్సులు బద్దలవ్వాల్సిందె. ఇప్పటికే హ్యాట్రిక్ మూవీస్ తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య-బోయపాటి మరోమారు అఖండ కు సీక్వెల్ గా అఖండ 2 తాండవం చిత్రం మొదలు పెట్టేసారు. రీసెంట్ గానే మహా కుంభమేళా లో అఖండ తాండవం కు సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు బోయపాటి.
ఆతర్వాత ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదిలో పడవ ప్రయాణం చేస్తూ బోయపాటి లొకేషన్స్ ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు అఖండ 2 పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మరింతగా క్రేజ్ పెంచేశారు. డాకు మహారాజ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న థమన్ అఖండ 2 పై పెంచిన హైప్ మామూలుది కాదు.
అఖండ తాండవం మాములుగా ఉండదు... మీరు ముందే ప్రిపేర్ అవ్వండి.. మాములు కసిగా లేరు బోయపాటి శ్రీను గారు అక్కడ... అఖండ 2 ఇంటర్వెల్ కే డబ్బులు ఇచ్చేయొచ్చు అంటూ థమన్ అఖండ 2 మూవీపై భారీ అంచనాలను పెంచేసాడు.