సమంత సినిమాలు చేసినా, చెయ్యకపోయినా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అయ్యే హీరోయిన్. పెళ్లి, విడాకులు ఇవేమి ఆమె క్రేజ్ ని కెరీర్ ని ఆపలేకపోయాయి. సమంత నే ఆరోగ్యం దృష్యా ఆచితూచి సినిమాలు ఒప్పకుంటుంది. సిటాడెల్ వెబ్ సీరీస్ తర్వాత అదే బ్యానర్ లో సమంత రక్త్ బ్రహ్మాండ్ సీరీస్ చేస్తుంది.
రీసెంట్ గా వైరల్ ఫీవర్ బారిన పడి కోలుకున్న సమంత జిమ్ లో నవ్వుతూ దర్శనమిచ్చింది. అయితే సమంత షూటింగ్స్ లేకపోయినా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అంతగా ట్రెండ్ అవ్వడానికి కారణం.. తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవడమే. ఆ తర్వాత సమంత ప్రేమలో ఉంది, బాలీవుడ్ డైరెక్టర్ తో సమంత ప్రేమలో పడింది అనే ప్రచారం జరిగింది.
తాజాగా సమంత కూల్ గా బుక్ చదువుతూ కనిపించింది. ప్రశాంతంగా సమంత బుక్ తీసుకుని పెన్ పట్టుకుని ఆలోచిస్తూ కనిపించింది. ప్రస్తుతం సమంత న్యూ పిక్ నెట్టింట సంచలనంగా మారింది.