రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చెంజర్ జనవరి 10 న సంక్రాంతి స్పెషల్ గా విడుదలైంది. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన గేమ్ చేంజర్ థియేటర్లు లోకి రాకముందే పెద్దగా బజ్ కనిపించలేదు, విడుదలయ్యాక గేమ్ చేంజర్ పై కనిపించిన నెగిటివిటి, ప్రేక్షకుల నుంచి వచ్చిన డివైడ్ టాక్ తో గేమ్ చెంజర్ మెగా ఫ్యాన్స్ ను నిరాశపరిచింది.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ సినిమాలతో డిజప్పాయింట్ అయిన రామ్ చరణ్ ఇమ్మిడియట్ గా RC 16 సెట్స్ లోకి వెళ్లిపోయారు. ఇక జనవరి 10 న విడుదలై గేమ్ చేంజర్ చిత్రం ఓటీటీ డీటెయిల్స్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి కనిపిస్తుంది.
భారీ డీల్ తో గేమ్ చెంజర్ ఓటీటీ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు గేమ్ చేంజర్ ను ఫిబ్రవరి 14 నుంచి అంటే సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కి తెచ్చే ఏర్పాట్లు చేసున్నారట. అంటే ఫిబ్రవరి 14 నుంచి గేమ్ చేంజర్ ని అమెజాన్ ప్రైమ్ లో చూసెయ్యొచ్చన్నమాట.