నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం మరో రెండు వారాల్లో విడుదల కాబోతుంది. చందు మొండేటి హీరోయిన్ గా కనిపించబోతున్న తండేల్ విడుదలకు ముందే నాగ చైతన్య మరో దర్శకుడితో సినిమాకు కమిట్ అయ్యాడు. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు తో నాగ చైతన్య తదుపరి చిత్రం చేస్తున్నాడు.
త్వరలోనే పట్టాలెక్కబోతున్న ఈ చిత్రంలో నాగ చైతన్యకు విలన్ గా ఓ క్రేజీ బాలీవుడ్ నటుడు కనిపించబోతున్నారట. బాలికా వధు సీరియల్ తో పేరు తెచ్చుకున్న బాలీవుడ్ స్పర్ష్ శ్రీవాత్సవ కార్తీ దండు చిత్రం లో చైతూతో ఢీ కొట్టబోతున్నాడు. లా పతా లేడీస్తో బాలీవుడ్ కి మరింత దగ్గరైన స్పర్ష్ శ్రీవాత్సవ అయితే విలన్ గా పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట.
ఇక హీరోయిన్ గా ముందు పూజ హెగ్డే అన్నారు, తర్వాత మీనాక్షి చౌదరి అన్నారు, తాజాగా శ్రీలీల పేరు వినబడుతుంది. ఫైనల్ గా మీనాక్షి లేదంటే శ్రీలీల నే చైతు కి జోడిగా ఫిక్స్ అవుతుంది అని తెలుస్తోంది.