నిన్న మంగళవారం ఉదయం నుంచి టాలీవుడ్ బడా నిర్మాతలైన దిల్ రాజు, మైత్రి మూవీస్ మేకర్స్ ఇళ్ళు, ఆఫీస్ లపై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి నిర్మించిన సినిమాల నిర్మాత దిల్ రాజు, డిసెంబర్ లో విడుదలైన పుష్ప 2 నిర్మాతల ఇళ్లపై అధికారులు దాడులు నిర్వహస్తున్నారు.
దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షిత రెడ్డి, ఇంకా శిరీష్, మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని లతో పాటుగా తాజాగా పుష్ప 2 దర్శకుడు సుకుమార్ ఇంటిపైన ఈ రోజు బుధవారం ఐటి అధికారులు సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప 2 నేషనల్ వైడ్ సక్సెస్ కొట్టిన సుకుమార్ ఇంట్లోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన విదేశాలకు వెళ్లి హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్ట్ నుండి సుకుమార్ ను ఇంటికి తీసుకెళ్లిన ఐటీ అధికారులు.
అటు హన్షిత రెడ్డి నిర్మించిన సినిమాల లావాదేవీలపై ఆరాలు ఇస్తున్నారు. వేసిన కలెక్షన్స్ పోస్టర్స్ కు ఐటి లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటి అధికారులు సడన్ గా దాడులకు దిగారు.