రాజమౌళి-మహేష్ బాబు కలయికలో జనవరి 2 న అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన SSMB 29 మూవీ ఎప్పుడు రెగ్యులర్ షూట్ కి వెళుతుందో అనేది ఇంకా అప్ డేట్ తెలియరాలేదు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా అనుకుంటున్నారని ప్రచారంలో ఉంది.
ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ప్రియాంక చోప్రా రీసెంట్ గా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దానితో ఆమె రాజమౌళి-మహేష్ కాంబో చిత్రం కోసమే హైదరాబాద్ లో దిగింది అనుకుంటున్నారు. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ప్రియాంక చోప్రా తాజాగా చిలుకూరి బాలాజీ టెంపుల్ లో కనిపించడం హాట్ టాపిక్ అయ్యింది.
ఆమె చిలుకూరి బాలాజీ టెంపుల్ లో స్పెషల్ పూజలు నిర్వహించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆలయ పండితులు ప్రియాంక తో పూజలు చేయించి ఆమెను ఆశీర్వదించిన ఫొటోస్ నెట్టింట సంచలనం అయ్యాయి.