గత గురువారం తెల్లవారుఝామున బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగోడు ప్రవేశించి, తనకు అడ్డుపడిన సైఫ్ అలీ ఖాన్ ను కత్తితో పొడిచి పారిపోయిన ఘటన కలకలం సృష్టించింది. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు.
ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ మెడ, వెన్నుముకకు తీవ్ర గాయాలు అయిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్ కు పలు సర్జరీలు చేయడంతో డాక్టర్లు వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కోలుకోవడంతో లీలావతి వైద్యులు సైఫ్ ను డిస్చార్జ్ చేసారు.
హాస్పిటల్ నుంచి సైఫ్ డిశ్చార్జ్ అయిన సమయంలో ఆయన వెంట తల్లి షర్మిలా ఠాగూర్ ఉన్నారు. సైఫ్ భార్య కరీనా కపూర్, కూతురు సారా అలీఖాన్, కొడుకు, పలువురు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇంటికి చేరుకున్నారు. సైఫ్ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తున్నాడు అని తెలియడంతో ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో సైఫ్ అపార్ట్మెంట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.