అఖిల్ అక్కినేని పెళ్లి వేడుకపై అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న అఖిల్, జైనబ్ రవ్జీ ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది మార్చి నెలలో అఖిల్ పెళ్లి చేసుకోనున్నారని చెబుతున్నారు.
అఖిల్, జైనబ్ మార్చి 24న వివాహ బంధం లోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. అయితే వీరి పెళ్లి తేదీపై అక్కినేని కుటుంబం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక అఖిల్ అక్కినేని వివాహం హైదరాబాద్‌లో జరగనున్నట్లు చెబుతున్నారు. నాగ చైతన్య శోభిత వివాహం జరిగినట్టుగానే, ఈ వేడుక కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుందని ఊహిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు నాగ చైతన్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా, అఖిల్ వివాహం కూడా అక్కడే జరగనుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే అవకాశముందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.