ఏదైనా సినిమా విడుదలై హిట్ అయ్యింది అంటూ నిర్మాతలు అభిమానుల కోసం పోస్టర్స్ వేసి పండగ చేసుకుంటే నెక్స్ట్ జరిగేదేమిటో తెలుసా వారి ఇంటి ముందు ఐటి అధికారులు నిలబడతారు. గతంలో పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అయ్యాక మైత్రి వారిని ఐటి అధికారులు ముప్పుతిప్పలు పెట్టారు.
తాజాగా సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ తో రోజుకో పోస్టర్ వేసిన దిల్ రాజు ఇంటి ముందు మాత్రమే కాదు గత నెలలో విడుదలై నేషనల్ వైడ్ హిట్ అయిన పూష 2 మేకర్స్ పై కూడా ఐటి దాడులు జరిగాయి. ఈ సంక్రాంతికి గేమ్ చెంజర్ దెబ్బేసినా సంక్రాంతికి వస్తున్నాం తో భారీ హిట్ కొట్టారు దిల్ రాజు
రోజుకో పోస్టర్ తో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ ఫిగర్ వేసి చూపించారు. కట్ చేస్తే ఐటి అదికారులు దిల్ రాజు ఇంటిపై, ఆఫీస్ పై, ఇంకా ఆయన కుటుంబంలోని కూతురు, తమ్ముడు ఇళ్లపై దాడులు చేశారు. పుష్ప 2 తో 2000 కలెక్షన్స్ కి దగ్గరగా చేరిన పుష్ప 2 మేకర్స్ పై కూడా ఐటి దాడులు జరగడం చూసి సినిమా హిట్టయితే నెక్స్ట్ జరిగేది ఐటి దాడే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.