Advertisement
Google Ads BL

డిప్యూటీ కాదు.. ఏకంగా సీఎం అంట


ఇప్పటివరకు లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చెయ్యాలనే డిమాండ్ చంద్రబాబు నాయుడు వెనుక మాత్రమే వినిపించింది. కానీ ఇప్పడు ఆయన ముందే లోకేష్ డిప్యూటీ సీఎం కాదు ఏకంగా సీఎం ని చెయ్యాలనే డిమాండ్ మొదలైంది. గత వారం రోజులుగా లోకేష్ ను డిప్యూటీ సీఎం ని చెయ్యాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలోనే కాదు, మీడియా ముందు కూడా మాట్లాడుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు ముందే టీడీపీ నేత టిజి భరత్ మా ఫ్యూచర్ లీడర్ లోకేష్, ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా కాబోయే ముఖ్యమంత్రి కూడా లోకేష్ అంటూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. చంద్రబాబు, లోకేష్ లతో సహా జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయిన సందర్భంలో టీజీ భరత్ ఈ రకమైన కామెంట్స్ చేసారు. 

నిన్నటివరకు లోకేష్ ను డిప్యూటీ సీఎంగానే చెయ్యాలని అన్నారు, కానీ ఇప్పుడు సీఎం ని చెయ్యాలంటూ కొత్త డిమాండ్ లేవనెత్తారు. అయితే ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు భరత్ పై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. సమావేశం అనంతరం చంద్రబాబు భరత్ ని ఫ్యూచర్ లో ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యొద్దని హెచ్చరించినట్లుగా, టీజీ భరత్ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 

Minister TG Bharath Hot Comments In Davous - Nara Lokesh Is Future CM:

TG Bharath Comments On Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs