సంక్రాంతి సీజన్‌లో దిల్‌రాజు భారీ విజయం సాధించారనే అనుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల ద్వారా దిల్‌రాజుకు మంచి పేరూ, గుర్తింపు వచ్చింది. డాకు మహారాజ్ సినిమాకు నైజాములో పంపిణీదారుగా ఉన్నా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు భారీ వసూళ్లతో దిల్‌రాజు అంచనాలను దాటేస్తోంది.
ఇప్పటికేసంక్రాంతికి వస్తున్నాం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 131 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం డాకూ మహారాజ్ వసూళ్లను కూడా క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ సినిమాకు ఇప్పటికే 300 కోట్లు కలెక్ట్ అయ్యాయని ప్రకటించారు. అయితే, గేమ్ ఛేంజర్ చిత్రం బడ్జెట్‌తో పోలిస్తే కలెక్ట్ చేసిన ఫిగర్స్ సరిపోకపోవడంతో దిల్‌రాజు కొంత నష్టాన్ని ఎదుర్కొన్నట్లు అనిపిస్తోంది.
అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ నష్టాన్ని సమతుల్యం చేసే దిశగా వెళ్ళిపోతుంది. మరోవైపు డాకు మహారాజ్ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్‌రాజుకు ఆ సినిమా కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలకు నిర్మాతగా, ఒక సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన దిల్‌రాజు నష్టాలను పోగొట్టి విజయాన్ని సాధించేలా కనిపిస్తున్నాడు.