ప్రస్తుతం హీరోయిన్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్న మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్నాం తో బిగ్ హిట్ అందుకుంది. లక్కీ భాస్కర్ భారీ సక్సెస్ తర్వాత మీనాక్షికి రెండు నిరాశపరిచే సినిమాలొచ్చినా మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం తో మీనాక్షి కొట్టిన హిట్ ఆమెను బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది.
ఈమధ్యన మీనాక్షి చౌదరి అక్కినేని యువ హీరో సుశాంత్ ని వివాహం చేసుకోబోతుంది అనే వార్త వైరల్ అవగా దానిని మీనాక్షి ఖండించింది. సుశాంత్ మంచి ఫ్రెండ్ మాత్రమే, సుశాంత్ తో ఎలాంటి ప్రేమ లేదు అని తేల్చేసింది. తాజాగా మీనాక్షి చౌదరి తన ఫస్ట్ క్రష్ ని బయటపెట్టింది.
9,10 క్లాస్ లలో అమ్మాయిలకు టీచర్స్ అంటే క్రేజ్ ఉంటుంది. అలానే నాకు 9th క్లాస్ లో మా టీచర్ అంటే ఇష్టం ఉండేది. ఆ టీచర్ ని మా క్లాస్ మొత్తం ఇష్టపడినా.. అందరికన్నా నాకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం ఉండేది. అదే నా ఫస్ట్ క్రష్ , ఆ తర్వాత ఇప్పటివరకు నాకు లవ్ లో పడేంత తీరిక, సమయం లేదు అంటూ మీనాక్షి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చింది.