తెలుగు అమ్మాయే అయినా కోలీవుడ్ లో సెటిల్ అయ్యి అడపా దడపా టాలీవుడ్ ని పలకరించి వెళ్లే అంజలి కి కరువు తీరే హిట్ ఆమె కేరీర్లో రాలేదనే చెప్పాలి. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ అయ్యాక అంజలి టైమ్ స్టార్ట్ అవ్వుద్ది అనుకుంటే అదేమీ జరగలేదు. అప్పట్లో అంజలి సాంప్రదాయ లుక్ లో కనిపించేది. అలా ఉంటే అవకాశాలు రావని తెలుసుకున్న అంజలి గ్లామర్ అవతారమెత్తింది.
ఆ వైపుగా కూడా అంజలికి అనుకున్న అవకాశాలు రాలేదు. తాజాగా గేమ్ చేంజర్ చిత్రంలో అంజలి పార్వతి పాత్రలో మెరవడమే కాదు.. గేమ్ ఛేంజింగ్ పాత్రలో అదరగొట్టేసింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అంజలి కి ఆ చిత్రంతో మంచి పేరొచ్చింది. ఇక అంజలి 12 ఏళ్ళ క్రితం విశాల్ తో జతకట్టిన మద గజ రాజా చిత్రం ఈ పొంగల్ కి విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది.
ఈ సినిమా హిట్ అంజలి కరువు తీర్చేసింది అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 12 ఏళ్ళ క్రితం రావాల్సిన సినిమా ఇప్పుడు విడుదలై హిట్ అవడం అనేది మాములు విషయం కాదు. అది హిట్ అవడం మరింత సెన్సేషనల్ అయ్యింది. సో అంజలికి ఆ విధంగా మద గజ రాజా హెల్ప్ అయ్యింది.