గత ఏడాది కింగ్ నాగార్జున తన పెద్ద కొడుకు నాగ చైతన్య వివాహ తేదీ నిశ్చయించిన కొద్దిరోజులకే తన చిన్న కొడుకు అఖిల్-జైనాబ్ రవద్జీ ఎంగేజ్మెంట్ చేసి అందరికి షాకిచ్చారు. నాగ చైతన్య-శోభిత ల పెళ్లి డిసెంబర్ 5 న జరిగింది. జైనాబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ వెడ్డింగ్ తేదీపై అందరిలో క్యూరియాసిటీ నడుస్తుంది.
అంతేకాదు ఈ మధ్యన అఖిల్ చాలా సీక్రెట్ గా తన కొత్త ప్రాజెక్ట్ పైకి వెళ్లిపోయాడని, వినరో భాగ్యము దర్శకుడితో అఖిల్ కొత్త సినిమా మొదలు పెట్టాడని అన్నారు కానీ.. అఫీషియల్ కన్ఫర్మమేషన్ లేదు. తాజాగా అఖిల్-జైనాబ్ రవద్జీ పెళ్లి తేదీ ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. మార్చి24న అక్కినేని వారసుడు అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా జరగబోతున్నట్లు సమాచారం.
అఖిల్ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను అక్కినేని, జైనాబ్ కుటుంబ సభ్యులు కలిసి చూసుకోబోతున్నారట. అఖిల్ పెళ్లిని అంగరంగ వైభవముగా నిర్వహించేందుకు నాగార్జున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని, అఖిల్-జైనాబ్ పెళ్ళికి బిజినెస్ పర్సన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది.