కోలీవుడ్ హీరో విశాల్ ఈమధ్యన కొద్దిగా డిఫరెంట్ గా అనారోగ్యంతో వణుకుతూ కనిపించేసరికి అందరూ విశాల్ ఆరోగ్యంపై రకరకాలుగా ఊహించేసుకున్నారు. కొంతమంది విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు అని చెప్పినా విశాల్ అనారోగ్యంపై చాలా ప్రచారాలు కనిపించాయి.
విశాల్ నటించిన మద గజ రాజా పొంగల్ కి విడుదలై సక్సెస్ అవడం, తాజాగా విశాల్ హుషారుగా డాన్స్ చేస్తూ కనిపించడంతో ఆయన ఆరోగ్యం విషయంలో అభిమానులకు ఓ క్లారిటీ వచ్చింది.
నిన్న శనివారం చెన్నై లో జరిగిన విజయ్ ఆంటోనీ కాన్ సర్ట్ లో పాల్గొన్న విశాల్ మై డియర్ లవరూ సాంగ్ పాడుతూ డాన్స్ చేస్తూ ఎంతో హుషారుగా కనిపించారు. విశాల్ చక్కగా ఆరోగ్యంతో డాన్స్ చేస్తూ కనిపించేసరికి ఆయన ఫ్యాన్స్ రిలాక్స్ అవుతున్నారు