Advertisement
Google Ads BL

మలయాళం పని ఓటీటీ రివ్యూ


ఓటీటీ పుణ్యమా అని ఏ భాషలో సినిమా సక్సెస్ అయినా అవి ఓటీటీలో విడుదలై తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేస్తున్నాయి. ఓటీటీలలో ప్రతి లాంగ్వేజ్ మూవీను ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. అందుకే ఆ సినిమాలను రీమేక్ చెయ్యాలేపోతున్నారు. ఎవరైనా ధైర్యం చేసి రీమేక్ చేస్తే అవి సో సో గా మిగిలిపోతున్నాయి. 

Advertisement
CJ Advs

తాజాగా మలయాళంలో తక్కువ బడ్జెట్ తో మొదటిసారి జోజు జార్జ్ దర్శత్వం వహించి ఆయనే కీలక పాత్రలో నటించిన పని చిత్రం తెలుగులో సోని లివ్ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. పని మూవీగా డబ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఇంప్రెస్స్ చేసింది. ఓటీటీలలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్స్, అలాగే మర్డర్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కంటెంట్ కు ఉన్న ఆదరణతోనే జోజు జార్జ్ పని మూవీ ఓటీటీలోనూ సక్సెస్ అయ్యింది. 

ఇక పని కథలోకి వెళితే నలుగురు ఫ్రెండ్స్ ఒకప్పుడు గుండాయిజం చేసినా ప్రస్తుతం ఆర్ధికంగా సెటిల్ అయ్యి మంచి హోదాలో ఉంటూ తమ స్నేహాన్ని ఫ్యామిలీస్ తో కలిసి  కంటిన్యూ చేస్తూ హ్యాపీగా ఉన్న సమయంలో ఓ ATM హత్య ఆ ఫ్యామిలీస్ ని ఎలా కుదిపేసింది అనేది సింపుల్ గా పని స్టోరీ. 

గిరి(జోజు జార్జ్) తన భార్య అనుపమకు టచ్ చేసిన ఇద్దరు సైకో కుర్రాళ్లతో గొడవపడగా.. ఆ ఇద్దరు ఆకతాయిలు గిరి స్నేహితులను ఎలా మట్టుబెట్టారు, ఆ కుర్రాళ్ళ వలన అనుపమ ఎలా సఫర్ అయ్యిందో అనేది పని కథ. 

జోజు జార్జ్ డైరెక్షన్, ఆయన పెరఫార్మెన్స్ మాత్రమే కాదు, ఆయన భార్య కేరెక్టర్ లో నటించిన అనుపమ, ఫ్రెండ్స్ గా చేసిన యాక్టర్స్ అందరూ తమ పాత్రల్లో అదరగొట్టేసారు. ఇక సైకో కుర్రాళ్ళుగా నటించిన ఇద్దరూ సెటిల్డ్ పెరఫార్మెన్స్ తో విలనిజాన్ని చూపించారు. 

సాంకేతికంగా వేణు - జింటో జార్జ్ ఫొటోగ్రఫీ హైలెట్ గా సాగుతుంది. నైట్ ఎఫెక్ట్ సీన్స్, ఛేజింగ్ సీన్స్ ను షూట్ అన్ని ఆసమ్. సామ్ సీఎస్-సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అనే చెప్పాలి. మను ఆంటోని ఎడిటింగ్ కూడా పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది.

సోని లివ్ లో అందుబాటులో ఉన్న ఈ పని చిత్రాన్ని మీరు ఓసారి వీక్షించేయ్యండి. 

Pani OTT Review:

Joju George Pani OTT Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs