మీనాక్షి చౌదరికి స్టార్ హీరోలు షాకిచ్చినా మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. లక్కీ భాస్కర్ తో మీనాక్షి చౌదరి 100 కోట్ల హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత మీనాక్షి చౌదరికి రెండు బిగ్ డిజాస్టర్స్ ఎదురయ్యాయి. మట్కా, మెకానిక్ రాకి నిరాశపరచినా మీనాక్షి చౌదరికి మళ్లీ సంక్రాంతి బిగ్ రిలీఫ్ నిచ్చింది.
అనిల్ రావిపూడి మీనాక్షి చౌదరికి సంక్రాంతికి వస్తున్నాం తో హిట్ అందించాడు. వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో-హీరోయిన్స్ గా జనవరి 14 సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మూడురోజుల్లో 100 కోట్ల మార్క్ చేరుకోవడంతో మీనాక్షి మళ్లీ 100 కోట్ల క్లబ్బు హీరోయిన్ అయ్యింది. 200 కోట్ల మార్క్ దగ్గరకు చేరింది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా, పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది. మీనాక్షి కన్నా ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ స్పేస్ ఎక్కువైనప్పటికీ ఆ చిత్రం హిట్ ట్రాక్ లోకి ఎక్కడం మీనాక్షి చౌదరికి రిలీఫ్ నిచ్చింది అనే చెప్పాలి. మరి ఈచిత్రం తర్వాత మీనాక్షి రేంజ్ మరోమారు పెరిగినట్లే అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.