ఇంతకుముందు మెగాస్టార్ చిరు వాల్తేర్ వీరయ్యతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు బాబీ ఈ ఏడాది సంక్రాంతికి మరో సీనియర్ హీరో బాలకృష్ణ తో డాకు మహారాజ్ తో హిట్ కొట్టారు. బ్యాక్ టు బ్యాక్ బాబీ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ లతో అవకాశాలు దక్కించుకుని సక్సెస్ ని కంటిన్యూ చేసారు.
ఈసంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ మూవీ మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చెయ్యడంలో సక్సెస్ అయ్యింది. వారం తిరక్కుండానే 114 కోట్లు కలెక్షన్స్ పట్టుకొచ్చిన డాకు మహారాజ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో టీమ్ ఉంది. మరి వరస విజయాలతో జోరు మీదున్న దర్శకుడు బాబీ కి నెక్స్ట్ అవకాశం ఇవ్వబోయే హీరో ఎవరు అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది.
ఈసారి బాబీ యంగ్ హీరోలెవరినైనా పడేస్తారా లేదంటే మరో సీనియర్ హీరో తోనే పని మొదలు పెడతారా.. బాబీ ఈసారి మాస్ మూవీ చేస్తారా, లేదంటే క్లాస్ కి షిఫ్ట్ అవుతారా, అసలు బాబీ తో చెయ్యబోయే ఆ లక్కీ ఎవరో హీరో అంటూ అప్పుడే నెటిజెన్స్ రకరకాలుగా చర్చలు మొదలు పెట్టేసారు.