రెండు రోజుల క్రితం సైఫ్ బంగాళాలోకి అక్రమంగా చొరబడి దొంగతనం చేసే క్రమంలో అడ్డొచ్చిన సైఫ్ అలీ ఖాన్ ను ఆరుసార్లు అతి కిరాతకంగా పొడిచి అపారిపోయిం నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. నిన్న శనివారం పోలీసులు థానేలో సైఫ్ ని పొడిచిన నిందితుడిని అరెస్ట్ చేసారు. అతని బాంగ్లాదేశ్ వాసి, అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు.
అతను ముంబై వచ్చి ఐదారు నెలలే అయ్యింది. అతని పేరు మహ్మద్, దితికి వచ్చాక విజయ్ దాస్ గా పేరు మార్చుకున్నాడు, విజయ్ దాస్ ముంబైలోని హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. కేవలం దొంగతనము కోసమే అతను సైఫ్ ఇంట్లొకి ప్రవేశించినట్లుగా చెప్పినట్లుగా ముంబై పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీ ఖాన్ మెల్లగా కోలుకుంటున్నారని, రేపు ఆయన్ని డిస్చార్జ్ చేసి ఇంటికి పంపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.