గ్లామర్ డ్రెస్సులు వేసి అందాలు ఆరబోసినా అస్సలు ఎబ్బెట్టుగా అనిపించని ఒకే ఒక్క హీరోయిన్ శ్రీలీల. డాన్స్ లతో కుమ్మేసే శ్రీలీల కి మళ్లీ గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. వరస ఆఫర్స్ తో అమ్మడు ఉక్కిరిబిక్కరి అవుతోంది. పుష్ప 2 లోని కిస్సిక్ అంటూ వేసిన స్పెషల్ స్టెప్స్ శ్రీలీలను బిజీ చేసింది.
పుష్ప 2 ఎఫెక్ట్ లేదా అమ్మడుకి లక్కు కలిసొచ్చిందో తెలియదు కానీ.. ఈ మధ్యన శ్రీలీల ముంబైలో కనిపించడమే కాదు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో మూవీ ఓకె చేసింది అనే టాక్ నడుస్తుంది. అఫీషియల్ గా ప్రకటన లేదు కానీ.. శ్రీలీల బాలీవుడ్ ప్రాజెక్ట్ ఓకె అయినట్లుగానే ఉంది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే శ్రీలీల తాజాగా వదిలిన శారీ లుక్ మెస్మరైజ్ చేసేదిలా ఉంది. చీరకట్టులో చిలిపిగా కవ్విస్తుందా అనేలా ఉంది శ్రీలీల లేటెస్ట్ లుక్.