మంచు ఫ్యామిలీ ఆస్తి వ్యవహారం రోడ్డున పడి చాలా కాలమే అయ్యింది. ఒకప్పుడు అన్నదమ్ములైన మనోజ్-విష్ణు గొడవపడేవారు. ఇప్పుడు విష్ణు ఫ్రేమ్ లోకి రాకుండా మంచు మనోజ్ తో మోహన్ బాబు యుద్ధం చేస్తున్నారు. వీరి గొడవలు కొట్టుకునేవరకు వెళ్లాయి. రీసెంట్ గా మంచు మనోజ్ ని తిరుపతిలోని విద్యానికేతన్ విద్యాసంస్థల లోపలి అనుమతి ఇవ్వకపోవడంతో పెద్ద రచ్చ అయ్యింది.
మళ్ళీ మళ్లీ ఇరువురు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. తాజగా మంచు మనోజ్ తన పోరాటం ఆస్తి కోసం కాదు, మా అన్న విష్ణు తండ్రిని, తన తల్లిని మాయ చేస్తున్నాడు, తన పోరాటం విద్యాసంస్థలలోని విద్యార్థుల కోసమే. వారికి అన్యాయం జరుగుతుంది. మా నాన్నను అడ్డుపెట్టుకుని మా అన్న నాటకం ఆడుతున్నాడు. కోట్ల డబ్బుతో సినిమాలు ఎలా నిర్మిస్తున్నాడు. అవి విద్యార్థుల డబ్బే.
విద్యార్థుల కోసం, కుటంబం, బంధువుల కోసం నా పోరాటం, న్యాయం దక్కేవరకు ఈ పోరాటం ఆగదు అంటూ మంచు మనోజ్ తాజాగా కలక్టరేట్ కి వచ్చిన సందర్భంలో మీడియాతో మాట్లాడాడు.
మనోజ్ ఇలా పోరాటంలో ఉండగా, మరోవైపు మంచు విష్ణు తన కన్నప్ప సినిమాలో ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు. బెంగళూరు, చెన్నై వంటి పట్టణాలలో మీడియా సమవేశాలు నిర్వహిస్తూ.. కన్నప్పని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.