సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రెటీల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఇక కొంతమంది సెలబ్రెటీల పట్ల భారీ స్థాయిలో విమర్శలు వస్తుంటాయి. ఇలా తమ గురించి వచ్చే విమర్శల పట్ల సెలబ్రెటీలు పెద్దగా స్పందించరు కానీ ఆ ట్రోల్స్ లిమిట్స్ దాటితే మాత్రం ఖచ్చితంగా స్పందిస్తారు. తాజాగా సోషల్ మీడియా ట్రోల్స్ పై థమన్ ఎమోషనల్ అయ్యారు.
నందమూరి బాలకృష్ణ డాకూ మహారాజ్ చిత్ర బృందం విజయాన్ని జరుపుకుంటూ హైదరాబాద్‌లో భారీ విజయోత్సవ వేడుకను నిన్న 17 శుక్రవారం నిర్వహించారు. చిత్ర సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆయన సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందిస్తూ.. ఈ ట్రోల్స్ సినిమాల విషయంలో ఒక పెద్ద నెగిటీవిటీని క్రియేట్ చేస్తాయని చెప్పాడు. మన విజయాన్ని డబ్బుతో కొనుగోలు చేయలేము అది అదృష్టం, కష్టం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. ఇలా వచ్చిన విజయం జీవితంలో స్థిరపడే ఆశను ఇస్తుందన్నారు. మనం విజయం సాధించినప్పుడు ప్రత్యేక గౌరవం పొందుతాము. సినిమా విజయం సాధించటం నిర్మాతకు చాలా ముఖ్యం. కానీ కొందరూ చేసే నెగిటీవ్ ట్రోల్స్ తమకు పెద్ద ఎదురుదెబ్బగా మారిపోతున్నాయి అన్నారు. ఒక నిర్మాత పెద్ద బడ్జెట్ సినిమాను నిర్మించడానికి అప్పులు చేయడం, కానీ వ్యతిరేక పరిణామాలు నిర్మాత భవిష్యత్తును చంపేస్తున్నాయి అని అన్నారు థమన్.
నిర్మాతలు సినిమాకు దేవుళ్లు అని వారిని మనం గౌరవించాలి అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం తెలుగు సినిమా వైపు చూస్తోంది. తమిళం లేదా మలయాళంలో ప్రతి దర్శకుడు తెలుగు నటుడిని తమ సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో నేను బాలీవుడ్‌లో ఉన్నప్పుడు, వారు తెలుగు దర్శకుడిని సినిమా చేయమని అడుగుతున్నారు. ఈ ట్రోల్స్‌తో మనమే మన తెలుగు సినిమాను చంపేస్తున్నాం. నాకు చిరాకు కలుగుతోంది. ప్రస్తుతం తెలుగు సినిమా గొప్ప శిఖరాలను చేరుకుంది. సినిమాలను చంపడం సరైంది కాదు. నెగిటీవిటి ట్రోల్స్ చేయడం ఆపండి. ఇలా చేయడం వల్ల మన తెలుగు సినిమాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లచ్చు అని చెప్పాడు.