ఈరోజు జనవరి 18 సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి ఫ్యామిలీ, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఎప్పటిలాగే తారక్, ఆయన అన్న కళ్యాణ్ రామ్ లు ఈరోజు తెల్లవారుఝామునే తాత సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చారు.
ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ను చూడటానికి భారీ సంఖ్యలో అభిమానులు ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తాత సమాధి వద్ద నివాళులు అర్పించి కొద్దిసేపు అక్కడే కూర్చుని వెళ్లిపోయారు.
ఆతర్వాత నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ ఆయన తల్లి నారా భవనేశ్వరి, ఇంకా కొంతమంది ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరి పెద్దాయనకు నివాళులు అర్పించారు.