2025 సంక్రాంతి కి ఇద్దరు సీనియర్ హీరోలతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పోటీపడ్డారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ డిసెంబర్ లో రావాల్సి ఉన్నా.. దిల్ రాజు పట్టుబట్టి మరీ సంక్రాంతిని చూజ్ చేసుకుని జనవరి 10 న గేమ్ చేంజర్ ని విడుదల చేసారు. గేమ్ చెంజర్ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం, రెండో రోజే హిందీ వెర్షన్ ప్రింట్ లీకవడం, సోషల్ మీడియా నెగిటివిటి అన్ని సినిమా కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడేలా చేసింది.
ఇక జనవరి 12 ఆదివారం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ విడుదలైంది. ఈ చిత్రం రిలీజ్ అయిన రోజు ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నా రెండో రోజు మాస్ ఆడియన్స్ కదలికతో డాకు కు హిట్ కళ వచ్చేసింది. నిర్మాతలను నష్టపరచకుండా డాకు మహారాజ్ ప్రతి ఒక్క ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వడం పక్కా. ఇప్పటికే 114 కోట్ల గ్రాస్ తో డాకు విజయ పథంలోకి ఎంటర్ అయ్యింది.
ఇక ఈ సంక్రాంతికి మరో సీనియర్ హీరో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతి రోజే ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ చిత్రం మరీ ఎక్స్ట్రార్డినరీగా లేకపోయినా.. కామెడీ ప్రియులు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 100కోట్ల మార్క్ ని చేరుకుంది. మూడో రోజులకే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది.
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి నిర్మాత దిల్ రాజుకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా కనిపించడం చూస్తే ఈ సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నామని ఆడియన్స్ మాత్రమే కాదు ట్రేడ్ వర్గాలు కూడా డిసైడ్ అయ్యేలా చేసింది.