టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మెగా ఫ్యాన్స్ చేతికి చిక్కారు. ఆయన గేమ్ చేంజర్ ని పట్టించుకోకుండా మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని ప్రమోట్ చేసారు, విడుదలయ్యాక కూడా గేమ్ చేంజర్ ని వదిలేసి సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్ లో మునిగి తేలుతున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.
అసలు గేమ్ చేంజర్ ని సంక్రాంతికి కాకుండా సోలోగా రిలీజ్ చెయ్యాల్సింది, గేమ్ చేంజర్ సినిమా ని దిల్ రాజు వదిలేసాడు, ఇకపై మెగా ఫ్యామిలోని ఏ ఒక్క హీరోతో సినిమా చేసే ధైర్యం చేయడు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం చూసి వెంకీ మామ కి దిల్ రాజు గుడి కట్టినా ఆశ్చర్య పోవక్కర్లేదు.. అంటూ దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం చిత్ర పోస్ట్ ప్రమోషన్స్ లో చేస్తున్న హడావిడి చూసి మెగా అభిమానులు ఈ విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా మెగా అభిమానులు గేమ్ చేంజర్ ని పట్టించుకోపోవడం పై దిల్ రాజు పై అసంతృప్తిగా అయితే కనబడుతున్నారు.