అక్కినేని కుర్ర హీరో నాగ చైతన్య ఫిబ్రవరి 7 న తండేల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ చిత్రం విడుదలకు ఇంకా 20 రోజుల సమయమే ఉంది. దానితో టీమ్ ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో కాదు కాదు డిఫ్రెంట్ గా మొదలు పెట్టింది.
శ్రీకాకుళం జాలరిపేట నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చైతు రగడ్ లుక్ లో కనిపిస్తున్నాడు. తాజాగా నాగ చైతన్య తండేల్ సెట్స్ లో చేపల పులుసు చేసి టీమ్ కి టెస్ట్ చూపించాడు. చేప ముక్కలను కలిపి మట్టి కుండలో చైతు చేపల పులుసు పెట్టాడు. తన టీమ్ మెంబెర్ కి ఆ పులుసు రుచి చుపించాడు.
చేపల పులుసు టేస్ట్ చేసిన ఆమె చాల బాగుంది అంటూ చైతు చేపల పులుసు ను పొగిడిన వీడియో మాత్రం తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో నాగ చైతన్య-సాయి పల్లవుల కెమిస్ట్రీ మాత్రం బాగా హైలెట్ అయ్యేలా అంది.